BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డిసెంబర్ 4న తిరుపతికి ప్రధాని నరేంద్ర మోదీ..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 08:52 PM
23 వీక్షణలు

మూడు రోజుల పాటు అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సు తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 4న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరల్‌లు (డీజీపీ), ఇన్‌స్పెక్టర్ జనరల్‌ల (ఐజీపీ) సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సు నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవడం, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడంలో యోగా ప్రాధాన్యతను వివరించనున్నారు. ప్రధాని పర్యటన, జాతీయ స్థాయి పోలీసు సదస్సు నేపథ్యంలో తిరుపతిలో భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించనున్నారు. దేశ అంతర్గత భద్రత, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశం ఉంది.