BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 04:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును హత్య చేసిన తల్లి

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
11 Nov, 2026 - 04:38 PM
8 వీక్షణలు

ప్రియుడితో కలిసి కుమారుడి హత్యకు కుట్ర.. మరో నలుగురి సహకారంతో ఘాతుకం

బెళగావి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్న కొడుకునే ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మాళమారుతి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, తల్లి మీనా నారాయణతో పాటు ఆమె ప్రియుడు, హత్యకు సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మీనా నారాయణ (44) భర్త కొన్నేళ్ల క్రితం మరణించడంతో తన కుమారుడు విజయ్ (24)తో కలిసి బెంగళూరులో నివసిస్తోంది. ఆమె ఓ బ్యూటీ పార్లర్‌లో మేనేజర్‌గా పనిచేస్తుండగా, అక్కడ కారు డ్రైవర్‌గా పనిచేసే రాకేశ్ జామూని (34)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ విషయం కుమారుడు విజయ్‌కు తెలియడంతో తల్లి తీరును తప్పుబట్టాడు. రాకేశ్‌కు దూరంగా ఉండాలని తల్లికి సూచించాడు. అయితే తన సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన మీనా, అతడిని హత్య చేయాలని ప్రియుడు రాకేశ్‌తో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ పథకంలో భాగంగా నవంబర్ 1న సొంతూరు బెళగావికి వెళ్దామని కుమారుడు విజయ్‌కు మీనా చెప్పింది. అనంతరం రాకేశ్ కారులో ముగ్గురూ బయలుదేరారు. ప్రయాణం మధ్యలో విజయ్‌కు ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపినట్లు, ఆ తర్వాత అతడి గొంతుకు శాలువా బిగించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బెళగావి చేరుకున్న అనంతరం విజయ్ మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను పరిశీలించి, విచారణ కొనసాగించగా కుమారుడి హత్య వెనుక తల్లి మీనా, ఆమె ప్రియుడు రాకేశ్ పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. ఈ హత్యకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ స్నేహితులు సచిన్, మనోజ్, తమ్మణ్ణ, ఏకనాథ్‌లను కూడా గుర్తించారు.

దీంతో మీనా నారాయణ, రాకేశ్ జామూనితో పాటు సచిన్, మనోజ్, తమ్మణ్ణ, ఏకనాథ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో సొంత కుమారుడిని హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.