BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 03:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎయిరిండియా విమానంలో హైజాక్ హెచ్చరిక..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
11 Nov, 2026 - 03:04 PM
6 వీక్షణలు

వాష్‌రూం అద్దంపై గుర్తుతెలియని వ్యక్తి రాతలు

కోల్‌కతా: కోల్‌కతా నుంచి ముంబయికి ఉదయం బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానంలో హైజాక్ హెచ్చరిక కలకలం రేపింది. విమానం వాష్‌రూంలోని అద్దంపై గుర్తుతెలియని వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసే అవకాశం ఉందనే అర్థం వచ్చేలా రాతలు రాసి ఉంచినట్లు గుర్తించారు.

విమానం టేకాఫ్ కావడానికి ముందు పైలెట్లు ఈ విషయాన్ని గమనించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమాన భద్రతకు సంబంధించిన అంశంగా ఈ హెచ్చరికను పరిగణనలోకి తీసుకున్నారు.

విమానాశ్రయ అధికారులు వెంటనే భద్రతా ప్రోటోకాల్స్‌ను అమల్లోకి తెచ్చారు. విమానాన్ని ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ బేకు తరలించి, అందులోని ప్రయాణికులను కిందకు దించారు. విమానంలో బాంబు స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఇతర భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించారు.

విమానాశ్రయ డైరెక్టర్ విక్రమ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, విమానం ఉదయం 10.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది. వాష్‌రూంలో లభించిన హెచ్చరికలో ఉదయం 11.10 గంటలకు విమానాన్ని హైజాక్ చేస్తామని పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ హెచ్చరిక రాసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు, భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.