BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 04:55 pm
Posted by : KOUNDINYASRI NANDURI VENKATESWARA RAJU

విద్యాభివృద్ధికి అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం

తెలంగాణ
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
11 Nov, 2026 - 04:55 PM
9 వీక్షణలు

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

హైదరాబాద్, నవంబర్ 11, 2026: భారతదేశ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విభాగం ఆచార్య తాళ్ల సుమాలిని పేర్కొన్నారు. విద్య ద్వారానే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ శ్రేయస్సు, దేశ పురోగతి సాధ్యమవుతాయని తెలిపారు.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 11న ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. పవన్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య తాళ్ల సుమాలిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆచార్య తాళ్ల సుమాలిని మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక విద్యకు మార్గదర్శిగా నిలిచి, విద్యాభివృద్ధికి బాటలు వేసిన ప్రముఖ నాయకుడు అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పదేళ్లపాటు కారాగార శిక్ష అనుభవించారని, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. పండితుడు, కవి, సంపాదకుడు, రాజనీతిజ్ఞుడిగా ఆయన బహుముఖ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషా కోవిదుడని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వంలో సుమారు 11 సంవత్సరాలపాటు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆజాద్, దేశ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రాథమిక, ఉన్నత విద్యతో పాటు సెకండరీ విద్య అభివృద్ధికి ప్రత్యేక కమిషన్ల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పారు. విద్యారంగంలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) వంటి సంస్థల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఖరగ్‌పూర్‌లో తొలి ఐఐటీ ఏర్పాటుకు కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

సంగీతం, నాటకం, సాహిత్యం, లలితకళల అభివృద్ధి కోసం వివిధ అకాడమీల ఏర్పాటుకు ఆయన కృషి చేశారని వివరించారు. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ వంటి సంస్థల ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ఆరు నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలనే లక్ష్యంతో పాటు బాలికల విద్యకు కూడా ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. హిందూ, ముస్లింల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు.

ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించిందని తెలిపారు. ఆయన జన్మదినమైన నవంబర్ 11ను 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

విద్య వల్ల వ్యక్తికి జ్ఞానం, ధైర్యం, సంస్కారం వంటి లక్షణాలు అలవడటంతో పాటు మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యం, సామాజిక స్థిరత్వం సాధ్యమవుతాయని ఆచార్య సుమాలిని అన్నారు. పేదరికాన్ని అధిగమించడానికి, సమాజ శ్రేయస్సుకు, దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విద్య ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మంచి ఆలోచనా విధానం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా విద్య ద్వారానే అభివృద్ధి చెందుతాయని వివరించారు.

ప్రస్తుతం విద్యావ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం కారణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. అంతర్జాలం అందుబాటులోకి రావడంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిందని, ఈ నేపథ్యంలో విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఇందుకు కృషి, పట్టుదల, ఏకాగ్రతతో పాటు విలువలతో కూడిన గుణాత్మక విద్య అవసరమని చెప్పారు.

విద్యార్థులు అంతర్జాలాన్ని అవసరమైన మేరకే వినియోగించుకోవాలని, దాని ఆకర్షణకు లోనై విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు నిత్యం పుస్తక పఠనం చేయాలని, చక్కని చేతిరాతను అలవర్చుకోవాలని చెప్పారు.

అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే అబుల్ కలాం ఆజాద్‌కు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, ఉపాధ్యాయులు రామేశ్వరరెడ్డి, ప్రభాస్ కుమార్, మధు, జాఫర్, రవీందర్ రెడ్డి, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.