BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 04:50 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
11 Nov, 2026 - 04:50 PM
9 వీక్షణలు

అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సర్పంచులు కాంగ్రెస్‌లో చేరడం సంతోషకరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు. ప్రజల అవసరాలు, గ్రామాల అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో దమ్మన్నపేట సర్పంచ్ ముదాం గౌతమి జానారెడ్డితో పాటు ఆత్మకూరు గ్రామ సర్పంచ్, ఇతరులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. గత పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, అధికారంలో ఉన్నవారు తమకే అధికారం అన్నట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. గత పాలనను గమనించిన ప్రజలు మార్పును కోరుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం కల్పించారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మంత్రి వివరణ

ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించడంతోపాటు వాటి ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి తెలిపారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.

దమ్మన్నపేట, ఆత్మకూరు గ్రామాల అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనతోపాటు అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి.. రోడ్డు ప్రమాద బాధితుడికి పరామర్శ

దమ్మన్నపేట కార్యక్రమానికి ముందు గొల్లపల్లి మండలం రంగధాంపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా నర్మెట్ల మౌనిక-మహేష్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని ప్రారంభించడంతో ఆ కుటుంబానికి నూతన గృహం అందుబాటులోకి వచ్చింది.

అనంతరం అదే గ్రామానికి చెందిన ఎద్దు శంకరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆయనను మంత్రి పరామర్శించారు. శంకరయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.