BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 03:59 pm
Posted by : K MAHESH

విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం

తెలంగాణ
/ హన్మకొండ / కాజీపేట
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 03:59 PM
16 వీక్షణలు

తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రూ.10 కోట్లతో కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులందరికీ సమాన విద్యావకాశాలు కల్పిస్తాం.. 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకం

వరంగల్: విద్య ద్వారానే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతోందని తెలిపారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో బుధవారం కాజీపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంప్లాయ్‌మెంట్ సర్వే నిర్వహించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్వే విశ్లేషణలో కుటుంబాలు, కులాలు, వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికి విద్యే ప్రధానమైన సాధనమని స్పష్టమైందన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో విద్యారంగంలో పటిష్టమైన పునాదులు వేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ ప్రారంభించిన ‘యంగ్ ఇండియా’ పత్రిక స్ఫూర్తితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 105 పాఠశాలలకు ఒకేసారి అనుమతులు మంజూరు చేశామని, ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.200 కోట్ల వ్యయం చేయనున్నట్లు తెలిపారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ పాఠశాలలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఒకే ప్రాంగణంలో కలిసి చదువుకునేలా ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి సమాన విద్యావకాశాలు కల్పించడమే ఈ విధానం ఉద్దేశమన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు ఆధునిక విద్యా సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి కూడా వసతి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య అందించేలా ఈ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతామని తెలిపారు. విద్యార్థులు కలిసి చదువుకోవడం ద్వారా సమానత్వం, సామాజిక సమైక్యత, సోదరభావం పెంపొందుతాయని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల పిల్లలకు ఒకే తరహా విద్యా వాతావరణం కల్పించడం ద్వారా సమాజంలో సామాజిక అంతరాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్య అందించే ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్ విద్యా విధానం, ఆధునిక తరగతి గదులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, రవాణా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్, టైలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను ఉచితంగా అందిస్తామని చెప్పారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను సెమీ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించనున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. వైద్య నిపుణుల సూచనలతో రూపొందించిన ఆహార ప్రణాళిక ప్రకారం వారానికి ఆరు రోజులు పౌష్టికాహారం, ప్రత్యామ్నాయ రోజుల్లో పాలు, రాగిజావ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ప్రభుత్వ రవాణా సదుపాయం ద్వారా విద్యార్థులను వారి ఇళ్లకు చేర్చే ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

విద్యార్థులు పగటిపూట నాణ్యమైన విద్యను అభ్యసించడంతోపాటు రాత్రి వేళల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యతోపాటు కుటుంబ అనుబంధాలు కొనసాగేందుకు ఈ విధానం దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సదుపాయాలు పాఠశాలల్లోనే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం కేంద్రీకృత వంటశాలల ద్వారా ఆహార సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, పౌష్టికాహారం కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, నాయకులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి, భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో పోటీపడే సామర్థ్యం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా చైర్మన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎండీ అయూబ్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, టీజీఎన్‌పీడీసీఎల్ ఎండీ వరుణ్ రెడ్డి, పోలీస్ కమిషనర్ శ్వేత, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.