BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల ప్రదానోత్సవం..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 06:31 PM
19 వీక్షణలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు

న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలు, స్వచ్ఛత కార్యక్రమాల అమలు ఆధారంగా అందించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26 జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛతలో ప్రతిభ కనబరిచిన నగరాలు, పట్టణాలకు ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత విభాగాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ వేడుకకు హాజరై అవార్డును అందుకోనున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచడం వంటి అంశాల్లో నగరాల పనితీరును ఈ సర్వేక్షణ్‌ ద్వారా అంచనా వేస్తారు. దేశవ్యాప్తంగా పట్టణాల్లో స్వచ్ఛతపై పోటీ స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు స్థానిక సంస్థలను మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం. ఏటా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన నగరాలను జాతీయ స్థాయిలో గుర్తించి ప్రోత్సహిస్తున్నారు.