BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:23 pm
Posted by : K MAHESH

సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి

తెలంగాణ
/ సంగారెడ్డి / ఆందోల్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 08:23 PM
23 వీక్షణలు

సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి

సోనియమ్మ జీవిత ప్రస్థానాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తా

సోనియాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మించాలనే తన ఆలోచనను కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వెల్లడించారు. సోనియాగాంధీ రాజకీయ ప్రస్థానం, త్యాగం, సేవాభావం, దేశ రాజకీయాల్లో ఆమె పోషించిన పాత్రను ప్రజలకు తెలియజేసేలా సినిమా రూపొందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

సంగారెడ్డి, నవంబర్ 11 (తొవ్వ ప్రతినిధి): సోనియాగాంధీ ఆత్మకథ ‘బీలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తెలుగులో సినిమా నిర్మిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని వెల్లడించారు.

ఇందిరాగాంధీ కోడలిగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్, ప్రియాంక గాంధీల తల్లిగా సోనియాగాంధీ సాగించిన జీవిత ప్రయాణాన్ని సినిమాలో చూపిస్తానని చెప్పారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించడం ఆమె రాజకీయ జీవితంలో ప్రత్యేక ఘట్టమని పేర్కొన్నారు. సోనియాగాంధీ త్యాగాలు, రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేయడమే సినిమా ప్రధాన ఉద్దేశమని జగ్గారెడ్డి వివరించారు.