BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:11 pm
Posted by : K MAHESH

సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 08:11 PM
19 వీక్షణలు

మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కారం.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 11: రామన్నపేట కోర్టు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌ను అఖిల భారత గౌడ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వలిగొండ పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సత్తయ్య గౌడ్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

అనంతరం అఖిల భారత గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. దంతూరి సత్తయ్య గౌడ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, అంచెలంచెలుగా ఎన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. తన వృత్తిపరమైన ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధిస్తూ గౌడ సామాజిక వర్గానికి మంచి పేరు, ప్రతిష్ఠలు తీసుకురావాలని అభిలషించారు. ఆయన సాధించిన స్థానం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత గౌడ సంఘం మహిళా విభాగం జాతీయ కార్యదర్శి చింతలూరి దీపా దేవి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయనంపల్లి శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాండాల దశరథ గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి రాములు గౌడ్, జువ్వగోని శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ మీడియా విభాగం కో-కన్వీనర్ సూరగౌని నవీన గౌడ్ తదితరులు పాల్గొని సత్తయ్య గౌడ్‌ను అభినందించారు.