BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:18 pm
Posted by : K MAHESH

పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 08:18 PM
21 వీక్షణలు

ఇంటి నిర్మాణానికి రేకులు, పైపుల అందజేత.. దశదిన కర్మకు బియ్యం, ఆర్థిక సహాయం

గార్ల, నవంబర్ 11:

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాంసింగ్ నాయక్ పలువురికి సహాయ సహకారాలు అందించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు తన వంతు తోడ్పాటు అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.

ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా నందిపాటి సామ్రాజ్యం ఇంటి నిర్మాణానికి అవసరమైన సుమారు రూ.15 వేల విలువైన రేకులు, పైపులను అందజేశారు. అలాగే గుండ్లపల్లి కనకరాజు దశదిన కర్మ కార్యక్రమ నిర్వహణ కోసం 50 కిలోల బియ్యంతో పాటు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపద సమయంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు పాల్గొని రాంసింగ్ నాయక్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఆయన చూపిస్తున్న సేవా మార్గంలో తాము కూడా ముందుకు సాగుతామని, భవిష్యత్తులో పేద కుటుంబాలకు, ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుని తమకు చేతనైనంత సాయం చేయాలని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, గ్రామానికి చెందిన బొట్ల వసంతరావు తన కుమారుడికి వీల్‌చైర్ అవసరమని రాంసింగ్ నాయక్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన త్వరలోనే వీల్‌చైర్ అందజేస్తానని హామీ ఇచ్చారు.

నిరుపేద కుటుంబాల అవసరాలను గుర్తించి, ఆపద సమయంలో వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజంలో సేవా స్ఫూర్తి మరింత పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు.