BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దుళ్ళ గ్రామంలో సర్పంచ్ పదవికి ఏకగ్రీవం చేస్తే రూ.1.50 కోట్ల విరాళం మాజీ సర్పంచ్ డీఎన్‌ఆర్ కుమార్తె విశ్వశ్రీ ప్రియ ప్రకటన

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 08:32 PM
29 వీక్షణలు

కడియం: గ్రామ సర్పంచ్ పదవికి తనను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందిస్తానని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ ప్రకటించారు. గ్రామాభివృద్ధికి విరాళం ప్రకటించే విషయంలో ఇప్పటికే మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ చేసిన ప్రకటనకు స్పందిస్తూ ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటీవల తోకల శ్రీనివాస్ తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధికి రూ.కోటి అందిస్తానని ప్రకటించగా, తాజాగా విశ్వశ్రీ ప్రియ అంతకంటే అధికంగా రూ.1.50 కోట్లు ఇస్తానని ప్రకటించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా విశ్వశ్రీ ప్రియ మాట్లాడుతూ, తన తండ్రి దివంగత దూడల నాగేశ్వరరావు, తల్లి రత్నం గతంలో గ్రామ సర్పంచ్‌లుగా పనిచేసి ప్రజలకు సేవలందించారని తెలిపారు. గ్రామ అభివృద్ధికి వారు చేసిన కృషి, ప్రజలతో వారికి ఉన్న అనుబంధం తనకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు. మరో ఏడాదిలో తన వైద్య విద్య పూర్తవుతుందని, అనంతరం గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఇందుకోసం రూ.1.50 కోట్లను విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు గ్రామాభివృద్ధి కోసం భారీ మొత్తాల్లో విరాళాలు ప్రకటించడంతో దుళ్ళ గ్రామ సర్పంచ్ ఎన్నికపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.