సెప్టెంబర్ 29న ఒంగోలుకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులకు పరామర్శ
కనిగిరి, సెప్టెంబర్ 28:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 29న ఒంగోలుకు రానున్నట్లు కనిగిరి వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన ఒంగోలుకు రానున్నట్లు పేర్కొంది.
సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటలకు ఒంగోలుకు చేరుకుని కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజశేఖర్ మృతిపై వైఎస్ జగన్ ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒంగోలు కార్యక్రమానికి హాజరుకావాలని వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ కోరారు.
కాకుమాను రాజశేఖర్ సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన గతంలో లిడ్‌క్యాప్ చైర్మన్‌గా పనిచేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు.