BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 13 November 2026, 05:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నవంబర్ 26 నుంచి పోలింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 05:54 AM
19 వీక్షణలు

ఏలూరు జిల్లా: జిల్లాలో 2026 గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం షెడ్యూల్ ప్రకటించింది. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎన్నికల వివరాలను వెల్లడించారు. జిల్లాలో మొత్తం 544 గ్రామ పంచాయతీలు, 5,696 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 2వ తేదీతో ముగియనుంది. ప్రతి దశలోనూ పోలింగ్ ముగిసిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి దశ నవంబర్ 26న మొదటి విడతలో బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి.నరసాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాల్లోని 177 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. రెండో దశ నవంబర్ 29న రెండో విడతలో భీమడోలు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలాల్లోని 194 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నవంబర్ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. మూడో దశలో చాట్రాయి, నూజివీడు మండలాలు మూడో విడతలో దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి, అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాల్లోని 173 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ముఖ్యంగా మూడో దశలో చాట్రాయి, నూజివీడు మండలాల్లో ఎన్నికలు జరగనుండటంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ వర్గాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు, ప్రచార కార్యక్రమాలపై గ్రామాల్లో ఆసక్తి నెలకొంది.