BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 13 November 2026, 07:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోటపాడు గ్రామం నుంచి అంతర్జాతీయ వేదికపైకి.. 31వ సీఐఐ సదస్సులో మోరంపూడి జయరామ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 07:39 AM
7 వీక్షణలు

ఏలూరు జిల్లా: మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి అంతర్జాతీయ స్థాయి వేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్న ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన యువ నిపుణుడు మోరంపూడి జయరామ్ అరుదైన గుర్తింపు పొందారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్న 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సు–2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా విభాగం తరఫున యంగ్ ప్రొఫెషనల్‌గా ప్రతినిధిగా పాల్గొంటున్నారు. దేశవిదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, మంత్రులు, విధాన నిర్ణేతలు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో కోటపాడు గ్రామానికి చెందిన జయరామ్ భాగస్వామి కావడం స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సీఐఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, యువతకు ఉపాధి అవకాశాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్న ఈ వేదికపై రాష్ట్ర ప్రణాళికా రంగం తరఫున జయరామ్ ప్రాతినిధ్యం వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామమైన కోటపాడులో పుట్టి పెరిగిన తనకు ప్రపంచ స్థాయి ప్రముఖులు పాల్గొంటున్న అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా విభాగం తరఫున పాల్గొనే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామిక అవకాశాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి అంశాలపై జరుగుతున్న చర్చల్లో భాగస్వామి కావడం గొప్ప అనుభవమని తెలిపారు. తనకు ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన ఏపీఎస్‌డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆలపర్తి వెంకటేశ్వరరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనే అవకాశం లభించిందని పేర్కొన్నారు. అదేవిధంగా బుధవారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సు ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్వాగత విందులోనూ మోరంపూడి జయరామ్ పాల్గొన్నారు. కోటపాడు వంటి గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా విభాగం తరఫున అంతర్జాతీయ స్థాయి వేదికపై ప్రాతినిధ్యం వహించడం గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలుస్తోంది. జయరామ్ సాధించిన ఈ అవకాశంపై కోటపాడు గ్రామస్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల యువతకు ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.