BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 08:59 pm
Posted by : K MAHESH

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 08:59 PM
8 వీక్షణలు

శాస్త్రీయ దృక్పథం, విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు టాలెంట్ టెస్ట్‌లు దోహదం: జిల్లా అధ్యక్షుడు చిర్రా యాకాంతం గౌడ్

కేసముద్రం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించడమే జన విజ్ఞాన వేదిక ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు చిర్రా యాకాంతం గౌడ్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్కూల్ లెవల్ టాలెంట్ టెస్ట్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని గురువారం కేసముద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు, శ్రీ వివేకవర్ధిని విద్యాసంస్థల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పుస్తక పరిజ్ఞానంతో పాటు శాస్త్రీయ ఆలోచనా విధానం, విజ్ఞానంపై ఆసక్తి, సమస్యలను విశ్లేషించే సామర్థ్యం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇలాంటి ప్రతిభా పరీక్షలు విద్యార్థుల ఆలోచనా స్థాయిని అంచనా వేయడంతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగేందుకు, తమలోని సృజనాత్మకతను అభివృద్ధి చేసుకునేందుకు స్కూల్ లెవల్ టాలెంట్ టెస్ట్‌లు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు.

విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు.