BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 08:32 pm
Posted by : K MAHESH

రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

తెలంగాణ
/ నల్గొండ / త్రిపురారం
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 08:32 PM
8 వీక్షణలు

గేదెలను తప్పించే క్రమంలో ప్రమాదం.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి

త్రిపురారం: రోడ్డుపై అకస్మాత్తుగా గేదెలు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పర్వతం మహేశ్ (24) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల ప్రకారం.. మహేశ్ గురువారం బైక్‌పై మిర్యాలగూడకు బయలుదేరాడు. ఈ క్రమంలో త్రిపురారం మండల శివారులోని రైస్ మిల్ సమీపానికి చేరుకోగానే రోడ్డుపైకి అకస్మాత్తుగా గేదెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు ప్రయత్నించిన మహేశ్ బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో అతడికి ముక్కు వద్ద తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన వారు వెంటనే మహేశ్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. చిన్న వయసులోనే మహేశ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతడి మృతితో గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.నరేశ్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.