BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 08:53 pm
Posted by : K MAHESH

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 08:53 PM
5 వీక్షణలు

70వ ఎస్‌జీఎఫ్ అండర్‌-17 పోటీల్లో ప్రాతినిధ్యం.. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభతో రాష్ట్రస్థాయికి అర్హత

కేసముద్రం: 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్‌-17 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్‌లోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపికయ్యాడు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో అక్షయ్ కుమార్ పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్ము రాజేందర్ వెల్లడించారు.

గత నెలలో నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో అక్షయ్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఆటలో నైపుణ్యం, ప్రతిభను ప్రదర్శించడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. గతంలోనూ జిల్లా స్థాయిలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని పలు బహుమతులు సాధించినట్లు పాఠశాల ప్రతినిధులు తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. అక్షయ్ కుమార్‌ను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.