BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 08:37 pm
Posted by : K MAHESH

హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 08:37 PM
2 వీక్షణలు

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు.. దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత

రూ.14 వేల విలువైన వీల్‌చైర్‌ను బాధిత కుటుంబానికి అందించిన గంగావత్ రాంసింగ్.. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు వైద్య, పోషకాహార సహాయం అందిస్తామని హామీ

గార్ల, నవంబర్ 12: ఇచ్చిన మాటకు కట్టుబడి దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేసి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగావత్ రాంసింగ్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. గార్ల మండల పరిధిలోని రాంపురం గ్రామ పంచాయతీని గతంలో సందర్శించిన సమయంలో బొడ్ల వసంతరావు కుమారుడికి వీల్‌చైర్ అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గురువారం రాంపురం గ్రామంలో రూ.14 వేల వ్యయంతో కొనుగోలు చేసిన వీల్‌చైర్‌ను బాధిత కుటుంబానికి అందజేశారు.

గ్రామ పర్యటన సందర్భంగా దివ్యాంగుడి పరిస్థితిని తెలుసుకున్న రాంసింగ్, అతడికి నిత్యజీవితంలో ఉపయోగపడేలా వీల్‌చైర్ అందిస్తానని ప్రకటించారు. తాజాగా ఆ హామీని అమలు చేస్తూ వీల్‌చైర్‌ను కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో బాధిత కుటుంబానికి కొంత ఊరట లభించింది.

ఇదిలా ఉండగా, రాంపురం గ్రామానికి చెందిన పెద్ది లింగమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తన టీం సభ్యులు రాంసింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన లింగమ్మను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడే వరకు అవసరమైన వైద్య సహాయంతో పాటు పాలు, పండ్లు, గుడ్లు, మందులు అందిస్తామని హామీ ఇచ్చారు. తన టీం సభ్యుల ద్వారా అవసరమైన సహాయ సహకారాలు కొనసాగిస్తామని తెలిపారు.

గ్రామాల్లో అవసరమైన వారికి అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న గంగావత్ రాంసింగ్‌కు రాంపురం గ్రామ యువత, పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీని అమలు చేయడంతో పాటు అనారోగ్యంతో ఉన్న మహిళకు సహాయం అందించేందుకు ముందుకు రావడాన్ని వారు అభినందించారు.