BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 07:39 pm
Posted by : K MAHESH

కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 07:39 PM
7 వీక్షణలు

దశ్రునాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి

నెల్లికుదురు: మండలంలోని రత్తిరాం తండాకు చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుగులోతు బాలాజీ నాయక్ తండ్రి దశ్రునాయక్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి గురువారం పార్టీ నాయకులతో కలిసి బాలాజీ నాయక్ స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా దశ్రునాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా నాయకుడు బాలాజీ నాయక్ తండ్రిని కోల్పోవడం విచారకరమని జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో బాలాజీ నాయక్ కుటుంబానికి పార్టీ నాయకులు అండగా ఉంటారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని, బాలాజీ నాయక్ తిరిగి ప్రజాక్షేత్రంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు నాయిని సత్యపాల్ రెడ్డి, దేవరం ప్రకాష్ రెడ్డి, మిట్టకంటి రాంరెడ్డి, మండల నాయకుడు గూదే యుగంధర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగులోతు భాస్కర్ నాయక్, పీక్ల తండా సర్పంచ్ ఝాన్సీ నరేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సాయి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు సునీల్ నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్ది రాజేష్, మండల నాయకులు గంకిడి ఎల్లారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.