BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 08:58 pm
Posted by : K MAHESH

మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 08:58 PM
2 వీక్షణలు

క్యాంపుతండలో మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు శ్రీకారం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్

కేసముద్రం: మహిళల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని క్యాంపుతండ గ్రామ సర్పంచ్ ధరావత్ కైక అన్నారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గ్రామైక్య సంఘం భవన నిర్మాణ పనులను గురువారం ఆమె ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ధరావత్ కైక మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సంఘాలకు సొంత భవనం అందుబాటులోకి రావడం వల్ల సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు, మహిళలు తమ కార్యకలాపాలను సమన్వయంతో కొనసాగించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

మహిళల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ధరావత్ శేఖర్, మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి, వార్డు సభ్యులు జాటోత్ సురేష్, బానోత్ లాలు, పంచాయతీ కార్యదర్శి మనోజ్, తాడూరి ఉమేష్, ధరావత్ రమేష్, ధరావత్ వీరన్న, ధరావత్ లాలు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.