BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 08:55 pm
Posted by : K MAHESH

కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 08:55 PM
2 వీక్షణలు

ప్రధాన కార్యదర్శిగా పోలేపాక రాజు స్వేరో.. జిల్లా కమిటీ సమక్షంలో నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కేసముద్రం: స్వేరోస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా స్వేరో కమిటీ సమక్షంలో గురువారం కేసముద్రం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో, ప్రధాన కార్యదర్శిగా పోలేపాక రాజు స్వేరో ఎన్నికయ్యారు.

జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో స్వేరో ఉద్యమం కొనసాగుతోందని నాయకులు తెలిపారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో పేదలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే స్వేరో భావజాలం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా కేసముద్రం మండలంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా మిట్టగడుపుల జీవన్ స్వేరో, కోశాధికారిగా పట్ల వెంకన్న స్వేరో, అధికార ప్రతినిధిగా గుజ్జునూరి అఖిల్ స్వేరో ఎన్నికయ్యారు. వీరితో పాటు పలువురిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు మంద ప్రవీణ్ స్వేరో మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించిన స్వేరో రాష్ట్ర కమిటీకి, మహబూబాబాద్ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో జ్ఞాన సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ స్వేరో లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా స్వేరో అధ్యక్షుడు బాషపంగు మహేందర్ స్వేరో, కేసముద్రం మండల స్వేరో కన్వీనర్ సభ్యులుగా పేర్కొన్న పోలేపాక రాజు స్వేరో, గడ్డం అశోక్ స్వేరో, జిల్లా స్వేరో అధికార ప్రతినిధి కుందూరు సుధీర్ స్వేరో, జిల్లా నాయకులు మేడి కరుణాకర్ స్వేరో, ఇండ్ల వెంకటేశ్వర్లు స్వేరో తదితరులు పాల్గొన్నారు.