BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 13 November 2026, 07:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇబ్రహీంపట్నంలో ICICI బ్యాంకుకు భారీ మోసం.. ఉద్యోగం లేదు.. బ్యాంకు ఖాతా లేదు.. అయినా రూ.30 లక్షల రుణం!

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 07:40 AM
8 వీక్షణలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో భారీ మోసానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. అసలు ఉద్యోగమే లేని వ్యక్తి లక్షల్లో నెలవారీ జీతం తీసుకుంటున్న ఉద్యోగిగా నమ్మించి ఏకంగా రూ.30 లక్షల రుణం పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో బ్యాంకు నిబంధనలకే సవాల్ విసిరిన ఈ ఘటన బ్యాంకింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నంలోని ఐసీఐసీఐ బ్యాంకులో రుణం పొందేందుకు కొందరు వ్యక్తులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎలాంటి ఉద్యోగం లేకపోయినా ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నత వేతనంతో పనిచేస్తున్నట్లు నకిలీ వేతన పత్రాలు, ఉద్యోగ నియామక ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. వీటికి తోడు నకిలీ ఆధార్, పాన్ కార్డులను కూడా తయారుచేసి బ్యాంకు అధికారులకు సమర్పించారు. పత్రాలన్నీ నిజమైనవిగా నమ్మించిన నిందితులు చివరకు రూ.30 లక్షల రుణాన్ని మంజూరు చేయించుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఐదుగురు మధ్యవర్తులు కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. నకిలీ పత్రాల తయారీ నుంచి రుణం పొందే వరకు పలు దశల్లో వీరు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు అసలు ఉద్యోగం లేని వ్యక్తికి, సమర్పించిన పత్రాల నిజానిజాలు పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే రూ.30 లక్షల రుణం ఎలా మంజూరైందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. రుణం మంజూరులో అధికారుల నిర్లక్ష్యం ఉందా? లేక నిందితులతో ఎవరైనా కుమ్మక్కయ్యారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ముఠా మరిన్ని బ్యాంకులను లక్ష్యంగా చేసుకుందా? ఈ మోసం ఒక్క బ్యాంకుకే పరిమితమైందా? లేక ఇదే తరహాలో ఇతర బ్యాంకుల్లోనూ నకిలీ పత్రాలతో రుణాలు పొందిందా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల వద్ద లభించిన పత్రాలు, వారి మధ్య జరిగిన లావాదేవీలు, రుణం పొందిన విధానంపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు పూర్తయితే ఈ మోసం వెనుక మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.