BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 13 November 2026, 07:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 07:40 AM
6 వీక్షణలు

సజ్జనార్‌కు అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన శాఖ డీజీ బాధ్యతలు.. కీలక శాఖల్లో అధికారుల మార్పులు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్‌ను బదిలీ చేశారు. ఆయనను తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అదనంగా ప్రత్యేక పోలీసు దళం (ఎస్పీఎఫ్) డీజీ బాధ్యతలను కూడా అప్పగించారు. సజ్జనార్ స్థానంలో హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్‌ను ప్రభుత్వం నియమించింది. ఇతర కీలక నియామకాలు ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్, జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా, మహిళా భద్రత విభాగం డీజీగా సౌమ్య మిశ్రా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నాగిరెడ్డి, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హా నియమితులయ్యారు. శిక్షణ విభాగం అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డీజీగా విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ నిర్వహణ, రహదారి, రైల్వే భద్రతా విభాగం డైరెక్టర్‌గా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. అదనపు డీజీ (శాంతిభద్రతలు)గా అకున్ సబర్వాల్, ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ, రైల్వే ఐజీగా కె. రమేశ్ నాయుడు నియమితులయ్యారు. టీజీ టీమార్స్‌లో రహదారి భద్రత విభాగం సంయుక్త సంచాలకుడిగా జోయల్ డేవిస్, జోన్-7 డీఐజీగా జి. చందన దీప్తి, జోన్-2 డీఐజీగా కె. నారాయణ నాయక్, సమన్వయ విభాగం డీఐజీతో పాటు జోన్-6 డీఐజీగా ఎల్.ఎస్. చౌహన్‌ను నియమించారు. ఇంటెలిజెన్స్ డీఐజీగా ఆర్. భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలతో తెలంగాణ పోలీసు శాఖలో పరిపాలనా పరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మార్పుతో పాటు కీలక విభాగాలకు కొత్త అధికారులను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.