BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 13 November 2026, 07:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ లో పంచాయతీ నామినేషన్ల ప్రక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 07:40 AM
9 వీక్షణలు

నామినేషన్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నోటీసుల జారీపై స్పష్టత ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నామినేషన్ కేంద్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) నోటిఫై చేయాలి. ఎన్నికల నోటీసును ఫారం-1 ద్వారా జారీ చేయాలి. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన కేంద్రం పేరు, తేదీ, సమయాన్ని ఫారం-1లో స్పష్టంగా పేర్కొనాలి. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కోకుండా అనువైన ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం సూచించింది. అలాగే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) నియామకానికి కూడా అనుమతించింది. అయితే ఏఆర్వోలు స్వతంత్రంగా కాకుండా సంబంధిత రిటర్నింగ్ అధికారుల నియంత్రణలోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నిర్వహణలో అధికారుల బాధ్యతలు, విధివిధానాలపై స్పష్టత ఏర్పడింది.