BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 13 November 2026, 05:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇబ్రహీంపట్నంలో మహిళకు పునర్జన్మ.. కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం డయల్‌ 112కు సమాచారం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 05:54 AM
6 వీక్షణలు

క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సకాలంలో స్పందించి మహిళను రక్షించిన ఖాకీలు కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఇబ్రహీంపట్నం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఆమె ప్రాణాలను కాపాడారు. డయల్‌ 112కు అందిన సమాచారం ఓ మహిళకు పునర్జన్మనిచ్చింది. పోలీసుల వేగవంతమైన స్పందనతో పెను ప్రమాదం తప్పింది. కుటుంబ సమస్యల కారణంగా మానసిక ఆవేదనకు గురైన మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీస్‌ కంట్రోల్‌ రూం సిబ్బంది ఈ విషయాన్ని స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులకు చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టి కాలువలో ఉన్న మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. అనంతరం మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కుటుంబ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని సూచించారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తి, తక్షణ స్పందనతో ఒక నిండు ప్రాణం నిలవడంపై నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు పోలీసు సిబ్బందిని అభినందించారు. ఆపదలో ఉన్నవారు, సమస్యలతో సతమతమవుతున్నవారు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.