BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 10:30 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
27 Sep, 2026 - 10:30 AM
16 వీక్షణలు

ఉపాధ్యాయులు బోధన అభ్యసన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అందుకు స్కూల్ కాంప్లెక్స్ లు వేదిక కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు మండలంలోని అంకంపాలెం జెడ్పి పాఠశాలలో జరుగుతున్న ప్రైమరీ కాంప్లెక్స్ ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీ నుంచి నిర్వహించే ఎఫ్ఎ2 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రతి శనివారం పాఠశాలల్లో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు నో బ్యాగ్ డే కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కార్యక్రమం అమలు చేయాలన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు పంజాబీ భాషను పరిచయం చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల విద్యా స్థాయి పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించడం పట్ల హెచ్ఎం పరిమళ కుమారి, ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పాఠశాలలో ఈ మ్యాగజైన్ నిర్వహిస్తున్న తీరును హెచ్ఎం పరిమళ కుమారి వివరించారు. పాఠశాలను క్రమశిక్షణతో నిర్వహిస్తున్న తీరు మిగిలిన పాఠశాలలకు ఆదర్శమని ప్రత్యేకంగా అభినందించారు. ఆయన వెంట సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి పి. రాంబాబు, జీసీడీవో ఏఎస్ఎస్ రమాదేవి, ఎంఈఓ వరప్రసాద్ ఉన్నారు.