కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ
ఆంధ్రప్రదేశ్
/
శ్రీ సత్యసాయి
కదిరి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి కదిరిలోని తన స్వగృహంలో ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలను పూల శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలతో మమేకమై స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన సమస్యలు, పార్టీ కార్యకలాపాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అనంతరం కార్యకర్తలు కూడా తమ ప్రాంతాల్లోని పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీకి సంబంధించిన అంశాలను పూల శ్రీనివాసరెడ్డితో పంచుకున్నారు. నాయకులు, కార్యకర్తలతో నిరంతరం అందుబాటులో ఉంటూ వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.