BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 06:24 pm
Posted by : కూనురు మధు

అత్యాచారం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు.

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
13 Aug, 2026 - 06:24 PM
255 వీక్షణలు

అత్యాచారం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు.

 మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.7 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 2020లో మిర్యాలగూడ-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై క్రైమ్ నంబర్ 97/2020 కింద కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ జాఖీర్ బాబాను నిందితుడిగా గుర్తించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఆధారాలు సేకరించి ఛార్జిషీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం కోర్టు నిందితుడిని ఐపీసీ సెక్షన్ 366, పోక్సో చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద దోషిగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా, పోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. శిక్షలు ఏకకాలంలో అమలు కావడంతో మొత్తం 25 ఏళ్ల శిక్ష అమలు కానుంది. జరిమానా చెల్లించకపోతే అదనపు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. కేసులో సమర్థవంతంగా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ ప్రక్రియలను సమర్థవంతంగా కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు.