ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో బుసిరాజుల వినయ్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
లక్సెట్టిపేట, Ntoday News: తెలంగాణ రీజియన్–1 పరిధిలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఉద్యోగి బుసిరాజుల వినయ్‌కు సంస్థ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించింది.
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీడీఓ (BDO) ఛానల్ విభాగంలో విశిష్టమైన పనితీరు కనబరిచినందుకు వినయ్‌కు ఈ అవార్డు అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్‌లోని ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సత్కార కార్యక్రమంలో సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) వినోద్ కుమార్ కొల అవార్డును అందజేశారు. సంస్థ వ్యాపార విస్తరణ, కస్టమర్ సేవల్లో వినయ్ చూపిన నిబద్ధత, కృషి, అంకితభావాన్ని గుర్తించి ఈ పురస్కారం అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ కొల మాట్లాడుతూ.. వినయ్ వంటి ఉద్యోగుల ప్రతిభ సంస్థకు విలువైన ఆస్తి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వినయ్‌కు అవార్డు లభించడంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.