విధుల్లోనే సీఐ అలీ మృతి.. విజయవాడలో విషాదం
ఆంధ్రప్రదేశ్
/
కృష్ణా
విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. నున్న పోలీస్‌స్టేషన్ సీఐ అలీ విధులు నిర్వహిస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సమాచారం.
గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిన సీఐని తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.
సీఐ అలీ మృతితో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచర అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉండగానే అధికారి మృతి చెందడంతో విజయవాడ పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.