BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 08:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెయింట్ మై టౌన్ చింతలపూడి పట్టణ సుందరీకరణకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 08:21 PM
79 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్తగా నిర్మించిన ఆర్ఎంబీ రోడ్డు మధ్యభాగంలోని సెంటర్ డివైడర్‌కు రంగులు వేసే కార్యక్రమానికి గురువారం రాత్రి 9 గంటలకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శ్రీకారం చుట్టనున్నారు.

ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు అందుబాటులో లేకపోయినప్పటికీ పట్టణ సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారులకు కొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సెంటర్ డివైడర్‌కు ఆకర్షణీయమైన రంగులు వేయనున్నారు.

పట్టణ అభివృద్ధి కేవలం ప్రభుత్వ నిధులతోనే కాకుండా ప్రజలు, దాతలు, నాయకులు, కార్యకర్తల సహకారంతోనూ సాధ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటనుంది. చింతలపూడి పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, పట్టణ సుందరీకరణపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోరింది.