BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 12 August 2026, 03:54 pm
Posted by : SANTHOSH KUMAR KOLLAPU

డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
12 Aug, 2026 - 03:54 PM
131 వీక్షణలు

దోసకాయలపల్లి, కోరుకొండ మండలం:

దోసకాయలపల్లి GSH జూనియర్ కాలేజీలో డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా నార్త్ జోన్ ఈగల్ టీమ్‌కు చెందిన ఎస్‌ఐ నారాయణ స్వామి గారు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్‌ వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.

“డ్రగ్స్ వద్దు బ్రో.. మంచి భవిష్యత్తు కోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.