BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 10:01 pm
Posted by : NTODAY NEWS

రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
26 Sep, 2026 - 10:01 PM
16 వీక్షణలు

రామన్నపేట, Ntoday News, సెప్టెంబర్ 26: వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను రామన్నపేట మండల రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కొండూరు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, వివిధ గ్రామాల రజక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాన్ని, ధైర్యసాహసాలను సంఘ నాయకులు స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.

రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆమనగంటి స్వామి, మండల గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, రామన్నపేట పట్టణ కమిటీ అధ్యక్షుడు అక్కినపల్లి లింగయ్య, జిల్లా కమిటీ సభ్యులు పొన్నం ఉప్పలయ్య, వడ్లకొండ రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ఆమె చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని అన్నారు. ఆమె ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆమె అడుగుజాడల్లో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వివిధ గ్రామాల రజక సంఘాల అధ్యక్షులు శంకరయ్య, నాగయ్య, నడిగోటి పాండు, మాండ్ర కిష్టయ్య, మాండ్ర మల్లేష్, శేఖర్, శీను, రవీందర్, రాములు, గణేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.