BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 07:13 pm
Posted by : K MAHESH

రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 07:13 PM
15 వీక్షణలు

కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ఆమె చేసిన సేవలు మరువలేనివి: నాయకుల నివాళి

వలిగొండ, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

వలిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఎలగందుల అంజయ్య తల్లి ఎలగందుల రాములమ్మ మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని పలువురు పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆమె మరణించడంతో పార్టీ శ్రేణులు, గ్రామస్థులు విషాదం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాములమ్మ మృతదేహానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎర్రజెండా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి ఎలగందుల రాములమ్మ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. పార్టీ భావజాలం, ఉద్యమాల పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతను గుర్తుచేసుకున్నారు. ఆమె చేసిన సేవలు, త్యాగాలను ప్రస్తుత యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, కమ్యూనిస్టు భావాలను అలవర్చుకొని ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన రాములమ్మను కోల్పోవడం బాధాకరమని నాయకులు పేర్కొన్నారు. ఆమె మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి, సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, గ్రామ శాఖ కార్యదర్శులు పులిపలుపుల మల్లేశం, పోషణపోయిన బొందయ్య, మండల పార్టీ నాయకులు పోలేపాక యాదయ్య, బొడిగె సుదర్శన్, ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి గుండెగాని నాగరాజు, కొయ్యకుగుర రామల్లు, తాల్క యాదయ్య, ఆకుల శ్రీను, పులిపలుపుల కిష్టయ్య, ఉపసర్పంచ్ అంబటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.