BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 07:12 pm
Posted by : K MAHESH

ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 07:12 PM
18 వీక్షణలు

2026–27 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సామాజిక కార్యకర్తల అభినందనలు

వలిగొండ, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడిగా 2026–27 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ ఈడెల్లి బలరాంను సామాజిక కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. మంగళవారం భువనగిరిలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

గత నెలలో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ ఈడెల్లి బలరాం జిల్లా ఐఎంఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు సామాజిక కార్యకర్తలు భువనగిరిలోని అనురాధ నర్సింగ్ హోమ్‌ను సందర్శించారు. అక్కడ డాక్టర్ బలరాంతో పాటు అనురాధ నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ అనురాధను కూడా పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ బలరాంకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకులు చిలుకమారి గణేష్ మాదిగ, దళిత నాయకులు పెరుమాళ్ల స్వామి, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, సీనియర్ జర్నలిస్ట్ పాక జహంగీర్ యాదవ్, దళిత నాయకులు సురుపంగ సుభాష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.