BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:41 pm
Posted by : K MAHESH

బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 06:41 PM
13 వీక్షణలు

కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ.. ప్రగాఢ సానుభూతి తెలిపిన రావుల సతీష్

నెల్లికుదురు, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గుగులోత్ బాలాజీ నాయక్ తండ్రి గుగులోత్ దశ్రు నాయక్ మృతి తీవ్ర బాధాకరమని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల సతీష్ అన్నారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన దశ్రు నాయక్ కుటుంబ సభ్యులను ఆయన మండల నాయకులతో కలిసి పరామర్శించారు.

మండలంలోని రత్తిరాం తండాకు చెందిన గుగులోత్ దశ్రు నాయక్ మృతి విషయం తెలుసుకున్న రావుల సతీష్, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన స్వగృహానికి వెళ్లారు. అక్కడ దశ్రు నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా రావుల సతీష్ మాట్లాడుతూ.. తండ్రిని కోల్పోవడం బాలాజీ నాయక్ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. దశ్రు నాయక్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు బాధను తట్టుకునే శక్తిని కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల శంకర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ పెరుమాండ్ల మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గంజి ప్రవీణ్ రెడ్డి, తాళ్ల సతీష్, బొల్లు లింగమూర్తి, చెన్నబోయిన శ్రీనివాస్, జెల్ల ఉపేందర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.