BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:40 pm
Posted by : K MAHESH

తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 06:40 PM
20 వీక్షణలు

కన్వీనర్‌గా రుద్రరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పోతుగంటి శ్రీనివాస్ ఎన్నిక

నెల్లికుదురు, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నెల్లికుదురు మండల నూతన అడహాక్ కమిటీని నియమించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అలవాలా శ్రీనివాస్, జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్ అలవాలా ఉపేందర్, కో-కన్వీనర్లు సముద్రల సోమయ్య, కొత్తపల్లి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో కమిటీ ఎంపిక జరిగింది.

ఈ సందర్భంగా మండల అడహాక్ కమిటీ కన్వీనర్‌గా రుద్రరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పోతుగంటి శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా పోతుగంటి రవి, వడ్కాపురం నర్సయ్య, మల్యాల ఐలయ్య, రుద్రరాపు ఉప్పలయ్య, పాలాభిందేల మహేష్‌లను ఎంపిక చేశారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సంఘం సంక్షేమం, అభివృద్ధి కోసం నూతన కమిటీ ఏర్పాటయ్యే వరకు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా, మండల నాయకుల సహకారంతో పాటు సంఘం సభ్యుల ప్రోత్సాహాన్ని తీసుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కుమ్మర సంఘం సభ్యుల ఐక్యత, సంక్షేమం, సంఘటిత అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ ప్రతినిధులు తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్యాల నర్సయ్య, సముద్రల వెంకన్న, బొడ్డుపెల్లి వెంకన్న, అలవాలా శ్రీశైలం, కుమ్మర సంఘం సభ్యులు పాల్గొన్నారు.