BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 08:03 pm
Posted by : K MAHESH

మంచాల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 08:03 PM
17 వీక్షణలు

రైతులకు పశుగ్రాసం పంపిణీ చేయాలి.. తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మించాలి

ఇబ్రహీంపట్నం, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మంచాల మండల అధ్యక్షుడు కొంగర వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పగడాల ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం మంచాల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకుడు చింతగింది చక్రపాణి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వంగల కృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచాల మండలంలో బోర్లలో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కరువు పరిస్థితులతో ఆందోళన చెందుతున్న రైతులకు ప్రభుత్వం వెంటనే పశుగ్రాసం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు అవసరమైన మేత అందక రైతులు మరిన్ని ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

తాగు, సాగునీటి కోసం రిజర్వాయర్ నిర్మించాలి

మంచాల మండలంలోని గ్రామాలకు తాగునీరు, సాగునీటి సమస్య పరిష్కరించేందుకు శివన్నగూడ ఎత్తిపోతల పథకం ద్వారా బండలేమూర్ గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ రిజర్వాయర్ ద్వారా మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేద రైతుల భూములను క్రమబద్ధీకరించాలి

22ఏ జాబితాలో ఉన్న లావణి, భూదాన్, ఇనాం భూములను క్రమబద్ధీకరించి పేద రైతులకు న్యాయం చేయాలని నాయకులు కోరారు. ఏళ్లుగా భూముల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో కె. లక్ష్మణ్, జి. మంగళవారం రాములు, శ్రీరామ్, హనుమంతు గుప్త, ఏరుకొండ భద్రయ్య, పొలమోని మల్లేష్, కాళ్ల చంద్రయ్య, జెనిగే పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.