BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 07:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు.. వేలాది మందికి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 07:55 PM
33 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విధానాలు, భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు, భూ కేటాయింపులు, కొత్త సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, బ్యాటరీ తయారీ, ఔషధ పరిశ్రమలు, విద్యుత్ రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 2026-31 కాలానికి ఏవీజీసీ-ఎక్స్ఆర్ విధానం, ఏపీ రోబోటిక్స్-ఫిజికల్ ఏఐ విధానాలకు ఆమోదం తెలిపింది. ఏపీ సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ విధానం 2024-29 ముసాయిదా సవరణలకు కూడా అంగీకారం తెలిపింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో ఏఎం ఇంటెలిజెన్స్ సంస్థ ఆధ్వర్యంలో రూ.31,387 కోట్ల భారీ పెట్టుబడితో 512 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. నాయుడుపేటలో రూ.4,000.20 కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ పదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో డిక్సన్ టెక్నాలజీస్ సంస్థకు రూ.700 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు స్థల కేటాయింపునకు అంగీకరించింది. విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గిగా స్థాయి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సుమారు 25 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఈపాక్ సంస్థ ఏఐ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమ ద్వారా 2,565 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో గ్రూప్ ఔషధ సంస్థలకు 173.82 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.236.92 కోట్లతో రవళి స్పిన్నర్స్ విస్తరణ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,569 మందికి ఉపాధి లభించనుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 30 ఎకరాల్లో ఫిక్కీ ఫ్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు అంగీకరించింది. అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో స్కికార్ప్ సమీకృత పాదరక్షల తయారీ పార్కు, తంబళ్లపల్లెలో సుమారు 21 ఎకరాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు డీజీపీ ఆధ్వర్యంలో మంగళగిరి కేంద్రంగా ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత డైరెక్టరేట్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. రాజధాని పరిధిలోని శాఖమూరులో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమిని లీజుకు ఇవ్వడంతో పాటు స్టాంపు సుంకం మినహాయింపునకు ఆమోదం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన సన్నిధి యాదవ, సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేవాదాయ శాఖలో సూపరింటెండెంట్ ఇంజినీర్ హోదాలో ముఖ్య స్థపతి పోస్టుల ఏర్పాటుకు కూడా అంగీకరించింది. ఎన్టీఆర్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా సంపీడిత జీవవాయు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్ సాంకేతికతతో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఆమోదం తెలిపింది. విజయవాడలో 15 మెగావాట్ల సామర్థ్యంతో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రం ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏపీ జెన్‌కోకు చెందిన 5.50 ఎకరాల భూమిని ఉచితంగా బదిలీ చేసేందుకు నిర్ణయించింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు 192.68 ఎకరాల వక్ఫ్ భూమిని 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మరోవైపు నాయుడుపేట ప్రత్యేక ఆర్థిక మండలిలో గతంలో వెబ్సోల్ రెన్యువబుల్స్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు కేటాయించిన భూముల కేటాయింపులను రద్దు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొత్తంగా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, భారీ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల పెంపు, విద్యుత్ రంగంలో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ దిశగా మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.