BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘పోషణ్ భీ పఢాయీ భీ’

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 04:24 PM
66 వీక్షణలు

రెండో విడత శిక్షణ చిన్నారుల పోషణ, విద్య, సమగ్ర అభివృద్ధిపై అంగన్‌వాడీ సిబ్బందికి అవగాహన

చాట్రాయి, నవంబర్ 10: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ్ భీ పఢాయీ భీ’ రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు బాల్యదశ నుంచే నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిక్షణలో 0 నుంచి 3 సంవత్సరాల వయస్సు పిల్లల అభివృద్ధి మైలురాళ్లు, నవచేతన కార్యక్రమం, ఈసీసీఈ దినోత్సవం నిర్వహణ, పిల్లల్లో వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించే విధానాలపై అంగన్‌వాడీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు సంబంధించిన ఆధారశిల కార్యక్రమం, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఆరోగ్య సూచికలు, బాలల ఎదుగుదలకు అవసరమైన పోషకాహార అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ గాయత్రీ దేవి మాట్లాడుతూ.. చిన్నారుల జీవితంలో తొలి ఆరు సంవత్సరాలు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ దశలో పిల్లలకు సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించడం ఎంతో ముఖ్యమన్నారు. పిల్లల ఎదుగుదలలో ఎదురయ్యే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలు కేవలం పోషకాహారం అందించే కేంద్రాలుగానే కాకుండా చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే విద్యా కేంద్రాలుగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి చిన్నారిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, ఆటపాటలు, కథలు, పాటలు, బొమ్మల ద్వారా నేర్చుకునే అవకాశాలు కల్పించాలని తెలిపారు. పిల్లల బరువు, ఎత్తు, ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోషకాహార లోపాలను గుర్తించడం, తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వడం కూడా అంగన్‌వాడీ సిబ్బంది బాధ్యత అని వివరించారు. ఈ శిక్షణ ద్వారా సిబ్బందిలో మరింత అవగాహన, నైపుణ్యం పెరిగి గ్రామస్థాయిలో చిన్నారులకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.