BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 07:15 pm
Posted by : K MAHESH

ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 07:15 PM
23 వీక్షణలు

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతులకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలి: మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు

గార్ల, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులు అవగాహన పెంపొందించుకొని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని గార్ల మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు సూచించారు. ప్రకృతి సిద్ధమైన పద్ధతులను అనుసరించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని తెలిపారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గార్ల మండల పరిధిలోని శేరిపురం రైతు వేదికలో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుగులోత్ భారతి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం మెరుగుపడుతుందని వివరించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పంటల సాగుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకోవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందులను వినియోగించకుండా ప్రత్యామ్నాయంగా ప్రకృతి సిద్ధమైన పదార్థాలను ఉపయోగించాలని సూచించారు. జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం వంటి వాటి తయారీ, వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. వీటి వినియోగంతో నేల సారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని తెలిపారు.

రైతులకు క్షేత్రస్థాయిలో ప్రాయోగిక శిక్షణ

అనంతరం వ్యవసాయ క్షేత్రంలో జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసే విధానాలను రైతులకు వివరించారు. వాటిని పంటలకు ఉపయోగించే, పిచికారీ చేసే పద్ధతులపై క్షేత్రస్థాయిలో ప్రాయోగిక శిక్షణ అందించారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులను రైతులు స్వయంగా నేర్చుకొని తమ పొలాల్లో అమలు చేసేలా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో రాజ్యలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ భరత్, ఉపసర్పంచ్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.