BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 08:07 pm
Posted by : K MAHESH

రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 08:07 PM
19 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 10:

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో తగిన వాటా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో కొనసాగుతున్న ఈ పాదయాత్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వలిగొండ నుంచి యాదగిరిగుట్ట వరకు సాగిన పాదయాత్రలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రామన్నపేట మండల అధ్యక్షుడు కల్లెం ఉపేందర్ తన బృందంతో కలిసి పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్‌కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా కల్లెం ఉపేందర్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో తగిన వాటా దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల రాజ్యాన్ని స్థాపించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.