BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లింగంపర్తిలో బుగత వసంతయ్య కుటుంబానికి డి. హరినాథ్ పరామర్శ

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 04:18 PM
25 వీక్షణలు

పార్టీ అభివృద్ధికి బుగత వసంతయ్య చేసిన సేవలు మరువలేనివి 

ఏలేశ్వరం నవంబర్ 10: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన బుగత వసంతయ్య (96) మృతి పట్ల సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 12 గంటలకు వసంతయ్య మరణించిన విషయం తెలుసుకున్న ఆయన, మంగళవారం లింగంపర్తి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బుగత బంగార్రావు, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత శివ తండ్రి అయిన వసంతయ్య కుటుంబ సభ్యులు, ఆయన భార్య సూర్యకాంతంను ఓదార్చారు. ఈ సందర్భంగా డి. హరినాథ్ మాట్లాడుతూ ఐపీఎఫ్ ప్రారంభ దశ నుంచి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ అభివృద్ధికి వసంతయ్య విశేషంగా తోడ్పడ్డారని కొనియాడారు. తన ఇద్దరు కుమారులు ప్రజా ఉద్యమాల్లో, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పనిచేసేందుకు స్వార్థం ఆశించకుండా ప్రోత్సహించారని తెలిపారు. అనేక సందర్భాల్లో ఇంటిపై పోలీసులు, భూస్వాములు దాడులకు పాల్పడినా ఆయన ఏమాత్రం భయపడలేదని, కుమారులు పార్టీ కోసం పనిచేయకుండా ఎలాంటి ఆంక్షలు విధించలేదని గుర్తుచేశారు. వసంతయ్య గొప్ప నటుడని, అనేక సాంఘిక, పౌరాణిక నాటకాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారని ఆయనతో కలిసి నటించిన ఆలమూరి సుబ్బారావు తెలిపారు. హాస్య చతురత కలిగిన వ్యక్తిగా అందరితో ఆప్యాయంగా మెలిగేవారని పేర్కొన్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ నాయకులు సైతం సంతాపం వ్యక్తం చేశారని హరినాథ్ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి లోటు లేకుండా ఆతిథ్యం ఇచ్చేవారని, వసంతయ్యతో పాటు సూర్యకాంతం అందరినీ ఆప్యాయంగా చూసుకునేవారని కొనియాడారు. పార్టీ అభివృద్ధికి, ఉద్యమాలకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొంటూ కామ్రేడ్ బుగత వసంతయ్యకు జోహార్లు అర్పించారు.