హనుమంతునిపాడులో వారం రోజులుగా నిలిచిపోయిన సాగర్ నీటి సరఫరా
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
హనుమంతునిపాడు
హనుమంతునిపాడు, Ntoday News: మండల కేంద్రంలో వారం రోజులుగా సాగర్ నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ సర్పంచ్ మురహరి నరసయ్య తెలిపారు.
గ్రామంలో తాగేందుకు మంచినీరు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు బయట నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఒక్కో వాటర్ బబుల్‌కు రూ.15 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సాగర్ నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి గ్రామానికి సాగర్ నీటి సరఫరాను పునరుద్ధరించాలని మురహరి నరసయ్య కోరారు.