BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:15 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
26 Sep, 2026 - 07:15 PM
11 వీక్షణలు

కూటమి పార్టీలతో సమన్వయం.. బలమైన అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ

కదిరి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నాయకులు, బీజేపీ ఆల్ సెల్ జాతీయ కో-కోఆర్డినేటర్ యస్. విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, నాయకులు-కార్యకర్తల అభిప్రాయాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామాలు, మండలాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేసి, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరంపై నేతలు చర్చించారు.

కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను ఎదుర్కొనే అంశానికి సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చారు. స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, పార్టీ బలాన్ని పరిగణనలోకి తీసుకుని పోటీ చేసే స్థానాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని నేతలు అభిప్రాయపడ్డారు.

అభ్యర్థుల ఎంపికలో ప్రజల్లో మంచి పేరు ఉన్నవారితో పాటు పార్టీ పట్ల నిబద్ధత, క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో స్థానిక పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా యస్. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి కీలకమైనవని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమర్థవంతమైన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని అన్నారు.

కదిరి నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఉత్తమ రెడ్డి, సుదర్శన్, పి.టి. ఆంజనేయులు, వెంకటేష్, జిల్లా మీడియా ఇన్‌చార్జ్ డీ.ఎల్. ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కేతే గిరిజమ్మ, మేకల నాగార్జున, ప్రతాప్, మైనారిటీ నాయకులు ఇంతియాజ్, షేక్ మైనుద్దీన్, బెల్లాల్, ఉత్తమ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే మండల అధ్యక్షులు షేక్ బాబ్జాన్, ఎర్రంశెట్టి రమేష్ బాబు, వేమ నారాయణ, బాబు రెడ్డి, నందిశెట్టి బాబు, రవిచంద్ర నాయుడు, రంగారెడ్డి, ఓబుల్ రెడ్డి, మంజునాథ్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, నాగేశ్వరి, నాగవర్ధన్ రెడ్డి, జనార్ధన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.