BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 09:55 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
26 Sep, 2026 - 09:55 PM
13 వీక్షణలు

ఆధునిక సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి..

కడప: కడప విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవన పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి ఎస్. సవిత, ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా ప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. టెర్మినల్ నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, పూర్తికి సంబంధించిన అంశాలపై అధికారులు, సంబంధిత ప్రతినిధులతో చర్చించారు.

నూతన టెర్మినల్ భవనాన్ని ఆధునిక సౌకర్యాలతో పాటు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తికానున్న నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

కడపతో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడంలో నూతన టెర్మినల్ కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ‘కనెక్టెడ్ ఆంధ్ర’ విజన్‌లో భాగంగా నూతన టెర్మినల్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. టెర్మినల్ పూర్తయితే కడప విమానాశ్రయం ద్వారా విమాన ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు.