BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:22 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
26 Sep, 2026 - 07:22 PM
26 వీక్షణలు
  • పశ్చిమ నియోజకవర్గంలో 6,790 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు

విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా: అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లపై హక్కులు కల్పించే కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 30న విజయవాడలో ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. భవానీపురంలోని పున్నమి ఘాట్ వేదికగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నారు.

భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో అడ్డూరి శ్రీరామ్ మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఎలాంటి వివక్ష లేకుండా ఇళ్ల పట్టాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.

తాజా అధికారిక వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడతగా 24,042 కుటుంబాలకు పట్టాలు అందించనున్నారు. మొత్తం 616.56 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించి లబ్ధిదారులకు హక్కులు కల్పించే ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 6,790 మంది లబ్ధిదారులకు 143.84 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలు అందనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పట్టాలు అందేలా ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేశారని అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 30న భవానీపురంలో నిర్వహించనున్న కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ.. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

సమావేశంలో పశ్చిమ మండల తహసీల్దార్ షేక్ ఇస్మాయిల్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, గుడివాడ నరేంద్ర రాఘవ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.