BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 08:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశభక్తికి ప్రతీక ప్రతిజ్ఞ టి.ఉమామహేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 08:21 PM
119 వీక్షణలు

ఏ.కొండూరు, ఆగస్టు 13: విద్యార్థుల్లో దేశభక్తి, సోదరభావాన్ని పెంపొందించేందుకు పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన ‘భారతదేశం–నా మాతృభూమి’ ప్రతిజ్ఞ ఎంతో దోహదపడుతుందని తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షులు టీ. ఉమామహేశ్వరరావు తెలిపారు.

గురువారం పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యం. రాంప్రదీప్ రచించిన పైడిమర్రి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఉమామహేశ్వరరావు పరిచయం చేసి మాట్లాడారు.

దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ప్రతిజ్ఞను ప్రతి విద్యార్థి అర్థం చేసుకొని ఆచరించాలని సూచించారు. దేశం పట్ల బాధ్యత, ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ప్రతిజ్ఞ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది బి. నాగేంద్రరావు, టీ. సుప్రియ తదితరులు పాల్గొన్నారు.