రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు!
అన్నమయ్య జిల్లా న్యూస్:
చౌడేపల్లి మండలం, పెద్దల కుంట గ్రామపంచాయతీ కొత్త ఇండ్లు సమీపంలో రోడ్డు పక్కనే గుర్తుతెలియని వ్యక్తులు పశువు మృహదేహాన్ని పడేసి వెళ్లడంతో త్రీవ దుర్వాసన వెదజల్లింది. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,
స్థానిక గ్రామాల ప్రజలను విచారించగా పశువును ఎవరు అక్కడ పడేసారో తమకు తెలియదని తెలిపారు. విషయం గుర్తించిన ఒక విలేఖరిగా స్పందించి గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరడం జరిగింది.
నా యొక్క వివరణ పై కొండయ్య గారి పల్లి సెక్రటరీ లోకేష్ గారు, వీఆర్వో వెంకటరమణ గారు వెంటనే స్పందించి, జెసిబి సహాయంతో రోడ్డు పక్కన ఉన్న పశు కళేబరాన్ని అక్కడ నుంచి తొలగించారు.
అనంతరం వెటర్నిటి డాక్టర్ పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో పశు కలేబారానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని గ్రామపంచాయతీ అధికారులు తెలియజేశారు.