కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి
సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి మీసాల శ్రావణ్ కుమార్
సైదాబాద్/ఎన్ టుడే న్యూస్.
కేంద్రం కనీస వేతన సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కేంద్ర కార్మిక సంఘం సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు మరో నిదర్శనమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మీసాల శ్రావణ్ కుమార్ విమర్శించారు. కనీస వేతన సలహామండలి బోర్డు నుంచి సీఐటీయు ను మినహాయించిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా నిర్వహించారు. BDL జనరల్ బాడీ సమావేశం సంతోష్ నగర్ సిఐటియు కార్యాలయంలో జరిగింది.
BDL BDEU ప్రెసిడెంట్ మురళి జనరల్ సెక్రెటరీ టి.సత్తయ్య మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనాలు, జీవన ప్రమాణాలు, ఉపాధి పరిస్థితులకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై నిర్ణయాలు తీసుకునే కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ వంటి ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అప్రజాస్వామికమన్నారు. కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన కేంద్ర కనీస వేతన సలహా బోర్డు వాస్తవానికి కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన త్రైపాక్షిక వేదికగా ఉండాలన్నారు. అయితే ప్రధాన కార్మిక సంఘాలను పక్కన పెట్టి,వారికిఅనుకూలమైన వారితో బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా కార్మికుల వేతనాలను అణచి వేయడానికి, యజమానులకు అనుకూలమైన విధానాలను చట్టబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను హరించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కనీస వేతనాల నిర్ణయ ప్రక్రియలో కూడా కార్మిక సంఘాల గొంతును నొక్కివేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో CITU BDL కోశాధికారి రవీందర్ .డి ఆర్ టి యూనియన్ దానకర్ణ చారి. వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీలక్ష్మి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.